‘వాట్‌ ద హెల్‌.. అసలేం జరుగుతోంది’

20 Jun, 2018 15:18 IST|Sakshi
ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌ (పాత ఫొటో)

ఆస్ట్రేలియా క్రికెట్‌ పరువు తీసారంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆసీస్‌ జట్టుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన డే- నైట్‌ వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టిమ్‌ పెయిన్‌ సేన దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆసీస్‌ మాజీ క్రికెట్‌ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆసీస్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన కావడంతో ఆసీస్‌ మాజీ క్రికెట్‌ దిగ్గజం షేన్‌వార్న్‌‌... ‘ఇప్పుడే నిద్ర లేచాను. ఇంగ్లండ్‌ స్కోరు చూశాను. అసలు అక్కడ ఏం జరుగుతోంది. వాట్‌ ద హెల్‌ అంటూ’ ట్వీట్‌ చేశాడు. ఇక ఆసీస్‌ మాజీ సారథి మైకేల్‌ క్లార్క్‌ కూడా ట్విటర్‌ వేదికగా తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కాగా 1986లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 206 పరుగులతో ఓడిన ఆసీస్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆ రికార్డును అధిగమించి మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది.

మరిన్ని వార్తలు