బిగ్ బాష్ కు షేన్ వార్న్ గుడ్ బై!

23 Jul, 2013 04:26 IST|Sakshi
బిగ్ బాష్ కు షేన్ వార్న్ గుడ్ బై!

బిగ్ బాష్ టోర్నికి స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ టోర్నిలో మెల్ బోర్న్ స్టార్ జట్టుకు ఆడుతున్న షేన్ వార్న్ సోమవారం రిటైర్ మెంట్ ప్రకటించాడు. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దడం, కామెంటేటర్ గా వ్యవహరించడం, వ్యాపార వ్యవహారాలను చూసుకోవడం చాలా కష్టంగా మారిందని.. అందుకోసమే బిగ్ బాష్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయం తీసుకున్నానని మెల్ బోర్న్ స్టార్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేన్ వార్న్ తెలిపాడు. ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లో వార్న్ కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా బిగ్ బాష్ లో సిడ్నీ థండర్ జట్టుతో మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైఖెల్ హస్సీ ఒప్పందం కుదుర్చుకున్నారు.

మరిన్ని వార్తలు