వార్నర్‌-బెయిర్‌ స్టో జోడి సరికొత్త రికార్డు

31 Mar, 2019 17:12 IST|Sakshi

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో వార‍్నర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు కోల్‌కాతా నైట్‌రైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌లపై వార్నర్‌ హాఫ్‌ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా మరో అర్థ శతకాన్ని నమోదు చేశాడు.  ఆర్సీబీతో మ్యాచ్‌లో మరో సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో 28 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించడంతో సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభం లభించినట్లయ్యింది. కాగా, అర్థ శతకాన్ని సెంచరీగా మలచుకున్నాడు బెయిర్‌ స్టో.  52 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని చేసిన జోడిగా నిలిచారు. ఈ క్రమంలోనే 2017లో వార‍్నర్‌-ధావన్‌లు నమోదు చేసిన 138 పరుగుల భాగస్వామ్యం రికార్డు బద్దలైంది. 185 పరుగుల ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత బెయిర్‌ స్టో(114;12 ఫోర్లు, 7 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఓవరాల్‌ ఐపీఎల్‌లో అత‍్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం రికార‍్డు కూడా బ్రేక్‌ అయ్యింది. 2017లో గౌతం గంభీర్‌-క్రిస్‌ లిన్‌లు 184 పరుగుల భాగస‍్వామ్యాన్ని సాధించారు. కేకేఆర్‌ తరఫున నమోదు చేసిన ఈ ఓపెనింగ్‌ భాగస‍్వామ్యమే ఇప్పటివరకూ అత్యధికం. దీన్ని తాజాగా వార‍్నర్‌-బెయిర్‌ స్టోలు బద్దలు కొట్టారు.

Liveblog

>
మరిన్ని వార్తలు