బర్త్‌డే రోజున వార్నర్‌ మెరుపులు

28 Oct, 2019 10:03 IST|Sakshi

అడిలైడ్‌: యాషెస్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. యాషెస్‌ టెస్టు సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 95 పరుగులు మాత్రమే చేసిన వార్నర్‌.. టీ20ల్లో తాను ఎంత ప్రమాదమో మరోసారి నిరూపించాడు. శ్రీలంకతో మూడు టీ20లో సిరీస్‌లో భాగంగా ఇక్కడ అడిలైడ్‌ ఓవల్‌ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో వార్నర్‌ బ్యాట్‌ ఝుళిపించాడు.

56 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆది నుంచి శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డ వార్నర్‌ చివరి వరకూ తన దూకుడు కొనసాగించాడు. ఆఖరి బంతికి సింగిల్‌ తీసి సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో వార్నర్‌కు ఇది తొలి సెంచరీ.  కాగా, అక్టోబర్‌ 27వ తేదీన వార్నర్‌ పుట్టినరోజు. ఆదివారం తన 33వ బర్త్‌డేను జరుపుకున్న వార్నర్‌ సెంచరీతో కదం తొక్కాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ఫించ్‌(64; 36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడగా, వార్నర్‌ సైతం అదే ఊపును కొనసాగించాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 122 పరుగులు చేసిన తర్వాత ఫించ్‌ ఔటయ్యాడు. ఆపై మ్యాక్స్‌వెల్‌(62; 28 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వీరిద్దరూ 107 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో ఆసీస్‌ రెండొందల మార్కును దాటింది.

ఆపై భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితమైంది. దాంతో 134 పరుగుల తేడాతో భారీ ఓటమి పాలైంది. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన లంకేయులు.. ఆసీస్‌తో తొలి టీ20లో మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఏ ఒక్క ఆటగాడు హాఫ్‌ సెంచరీ కూడా సాధించకపోవడంతో లంకకు ఘోర పరాజయం తప్పలేదు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా మూడు వికెట్లు సాధించగా, మిచెల్‌ స్టార్క్‌,  పాట్‌ కమిన్స్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఆస్టన్‌ ఆగర్‌కు వికెట్‌ దక్కింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’

వేలానికి బట్లర్‌ ప్రపంచకప్‌ జెర్సీ

హాకీ ఇండియా, ఏఐఎఫ్‌ఎఫ్‌ విరాళం రూ. 25 లక్షలు

కుదించి... మనవాళ్లతోనే ఆడించాలి

రెండో ర్యాంక్‌లో రెజ్లర్‌ బజరంగ్‌

సినిమా

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం