వార్నర్‌ రియాక్షన్‌ అదిరింది!

7 Sep, 2019 12:50 IST|Sakshi

మాంచెస్టర్‌:  ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లపై ఎగతాళి పర్వం కొనసాగుతూనే ఉంది. గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధాన్ని అనుభవించినా వార్నర్‌, స్మిత్‌లను టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు ఇంగ్లిష్‌ అభిమానులు. యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు మొదలుకొని ఇప్పటివరకూ ‘చీటర్‌’ వేధింపుల బారిన పడుతూనే ఉన్నారు వీరిద్దరూ. నాల్గో టెస్టులో భాగంగా శుక్రవారం ఆసీస్‌ జట్టు తన డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి గ్రౌండ్‌లోకి వెళుతున్న సమయంలో ఇంగ్లిష్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌  వార్నర్‌పై మరోసారి నోరే పారేసుకున్నారు. ‘హేయ్‌ డేవిడ్‌ వార్నర్‌.. నువ్వొక చీటర్‌’ అంటూ ఇంగ్లండ్‌ అభిమానులు ఎగతాళి చేసే యత్నం చేశారు. దీనికి వెంటనే వెనక్కి తిరిగి చూసిన వార్నర్‌..  తన రెండు చేతుల్ని పైకి ఎత్తి వావ్‌ అంటూ నవ్వుతూ రిప్లూ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 497/8 వద్డ డిక్లేర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 200 పరుగులతో ఎదురీదుతోంది. రోయ్‌ బర్న్స్‌(81), కెప్టెన్‌ జో రూట్‌(71)లు హాఫ్‌ సెంచరీలతో మెరిశారు.  బెన్‌ స్టోక్స్‌(7 బ్యాటింగ్‌), బెయిర్‌ స్టో(2 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ భారీ స్కోర్లు సాధిస్తే ఇంగ్లండ్‌ తేరుకునే అవకాశం ఉంది.  తొలి టెస్టులో ఆసీస్‌ గెలిస్తే, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టును  ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది. దాంతో నాల్గో టెస్టులో గెలిచిన జట్టు యాషెస్‌ సిరీస్‌ను గెలిచే అవకాశాలు ఉండటంతో ఇరు జట్లు తమ శక్తిమేర పోరాడే అవకాశం ఉంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా