నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై కోహ్లి ఆగ్రహం..!

3 May, 2018 13:13 IST|Sakshi

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారధి విరాట్‌ కోహ్లి, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడనే వార్త ఒకటి హల్‌చల్‌ చేస్తున్నాయి. నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ సరిగా లేదంటూ కోహ్లి నిప్పులు చెరిగాడని పుణె మిర్రర్‌ ఒక కథనం ప్రచురించింది. ‘ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నరైన్‌ బౌలింగ్‌ చేశాడు. అయితే ఆ యాక్షన్‌పై అనుమానంతో కోహ్లి, ఓవర్‌ ముగిశాక అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. నరేన్‌ త్రో బౌలింగ్‌ చేస్తున్నట్లు కోహ్లి అంపైర్‌తో చెప్పాడు’ అని ఆ కథనం పేర్కొంది. 

బౌలర్‌ సక్రమంగా బౌలింగ్‌ చేస్తున్నాడా లేదా అని తేల్చాల్సింది అంపైర్లని, కానీ, సహనం కోల్పోయిన కోహ్లి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించాడని ఆ కథనంలో తెలిపింది . ఈ వ్యవహారంపై మ్యాచ్‌ రిఫరీ నయ్యర్‌ ని మీడియా ప్రశ్నించగా... ఇది పూర్తిగా ఫీల్డ్‌లో జరిగిన విషయమని, మీడియాతో మాట్లాడలేనని చెప్పారు. దీనిపై స్పష్టత కావాలంటే బీసీసీఐని సంప్రదించాలని నయ్యర్‌ సూచించాడు. మరోవైపు ఈ ఘటనపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వెస్టిండీస్‌ ఆటగాడు సునీల్‌ నరెన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ విషయంలో గతంలో ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లోనూ ఫిర్యాదు నమోదు అయ్యింది.

>
మరిన్ని వార్తలు