'పతకం కోసం 12 ఏళ్లు కష్టపడ్డా'

24 Aug, 2016 08:12 IST|Sakshi
'పతకం కోసం 12 ఏళ్లు కష్టపడ్డా'

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించిపెట్టాలన్న తన కలం సాకారమైందని మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. దీని కోసం గత 12 ఏళ్లుగా శ్రమిస్తున్నానని చెప్పింది. రియో ఒలింపిక్స్ భారత్‌కు తొలి పతకం అందించిన సాక్షి మాలిక్ బుధవారం ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తనను ఘనంగా స్వాగతించడం పట్ల సాక్షి మాలిక్ సంతోషం వ్యక్తం చేసింది. ఇదో అద్భుతమైన అనుభవమని వ్యాఖ్యానించింది. దేశానికి పతకం సాధించిపెట్టడం గర్వకారణంగా ఉందని పేర్కొంది.

విమానాశ్రయంలో ఇంత ఘనంగా తన కుమార్తెకు స్వాగతం లభిస్తుందని ఊహించలేదని ఆమె తండ్రి సత్బీర్ అన్నారు. ఇది గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా మొఖ్రా ఖాస్ గ్రామంలోని తన ఇంటికి సాక్షి మాలిక్ చేరుకుంది. ఇక్కడే భారీ జనసమూహం మధ్య ఆమెకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సన్మానం చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు