కోహ్లి సాధిస్తాడా!.. అనుమానమే?

14 May, 2020 09:17 IST|Sakshi

హైదరాబాద్‌: క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న అనేక రికార్డులను టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి బద్దలుకొట్టగలడా అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు పాకిస్తాన్‌ మజీ సారథి, దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌. కోహ్లి అత్యుత్తమ బ్యాట్‌మన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదని కానీ సచిన్‌తో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను నెలకొల్పాడాడని గుర్తుచేసిన అక్రమ్..‌ సచిన్‌  పేరిట ఉన్న పలు రికార్డులను కోహ్లి బ్రేక్‌ చేస్తాడా లేడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలన్నాడు.

‘నేను మనసులో ఏది అనుకుంటే అది నిర్మోహమాటంగా బయటకు చెబుతాను. సచిన్‌, కోహ్లి ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు, ఇప్పటికే కోహ్లి అనేక రికార్డులను నెలకొల్పాడు. కానీ వీరిద్దరిని పోల్చడం సరికాదు. ఇద్దరి బ్యాటింగ్‌లో, బాడీ లాంగ్వేజీలో చాలా తేడాలు ఉన్నాయి. అయితే సచిన్‌, కోహ్లిలు దూకుడైన ఆటగాళ్లు. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంది. సచిన్‌ను స్లెడ్జింగ్‌ చేస్తే నవ్వుతూ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్తాడు. ప్రత్యర్థి బౌలర్‌ కవ్వింపు చర్యలకు దిగితే సచిన్‌ మరింత ఏకాగ్రతతో వ్యవహరిస్తాడు. కానీ కోహ్లి ఏకాగ్రతను దెబ్బతీయం చాలా సులువు. అతడిని స్లెడ్జింగ్‌ చేస్తే చాలా సులువుగా తన సహనాన్ని కోల్పోతాడు. అయితే ఇలా సహనం కోల్పోతే వికెట్‌ కోల్పోయే ప్రమాదం ఉంది’ అని వసీం అక్రమ్‌ వ్యాఖ్యానించాడు. 

చదవండి:
‘కెప్టెన్సీ పంచుకోవడం కోహ్లికి నచ్చదు’
'పాంటింగ్‌ నిర్ణయం మా కొంప ముంచింది'

మరిన్ని వార్తలు