మాజీలపై అక్రమ్ విమర్శలు

9 May, 2016 14:01 IST|Sakshi
మాజీలపై అక్రమ్ విమర్శలు

కరాచీ:పలువురు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై ఆదేశ బౌలింగ్ దిగ్గజం  వసీం అక్రమ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ క్రికెట్ కోచ్ కు పదవి చేపట్టే అర్హత చాలామంది తమ దేశ మాజీ ఆటగాళ్లకు ఉన్నా, వారు కనీసం ఆ పదవికి ఆప్లై చేయకపోవడాన్నిఅక్రమ్ తప్పుబట్టాడు. ఇది తనను చాలా నిరాశకు గురి చేసిందని మాజీల తీరుపై మండిపడ్డాడు.

 

'పాక్ కోచ్ పదవిని చేపట్టడానికి మా దేశంలో చాలా మంది మాజీలకు అర్హత ఉంది. అయినా వారు ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఇందుకు కారణం కోచ్ ను నియమించే పనిని నాతో పాటు, రమీజ్ రాజాకు పీసీబీ అప్పగించటమే. ప్రధాన కోచ్ను నియమించే క్రమంలో షార్ట్ లిస్టింగ్ బాధ్యతను పీసీబీ మాకు అప్పగించింది. దీంతో ఆ మాజీలు ముందుకు రాలేదు. ఇది సరైన పద్ధతి కాదు'అని అక్రమ్ విమర్శించాడు. ఒక పాక్ మాజీ ఆటగాడైతై కోచ్ పదవికి అప్లై చేసిన అనంతరం నేరుగా చైర్మన్తో మాట్లాడితే సరిపోతుందని వ్యాఖ్యానించినట్లు అక్రమ్ పేర్కొన్నాడు. ఇటువంటి మైండ్ సెట్ ఉంటే కోచ్ పదవిని సమర్ధవంతంగా ఎలా నిర్వర్తించగలడు? అని అక్రమ్ ప్రశ్నించాడు.

మరిన్ని వార్తలు