వారి వీడియోలు చూసేవాడ్ని: కేఎల్‌ రాహుల్‌

18 Jan, 2020 13:24 IST|Sakshi

రాజ్‌కోట్‌: ఇటీవల కాలంలో ఫుల్‌ స్వింగ్‌లో దూసుకుపోతున్న కేఎల్‌ రాహుల్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌లో చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తనకు ఫలానా స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనే నిబంధన ఏమీ లేదన్నాడు. రిషభ్‌ పంత్‌కు గాయం కావడంతో కీపింగ్‌ బాధ్యతల్ని సైతం తన భుజాలపై వేసుకున్న రాహుల్‌.. బ్యాటింగ్‌లో కూడా సత్తాచాటుతున్నాడు. గతంలో పేలవమైన ఫామ్‌ విమర్శల పాలైన రాహుల్‌ తన ఆట ద్వారానే వారికి సమాధానం చెప్పాడు. ఆసీస్‌ తొలి వన్డేలో ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి రాణించిన రాహుల్‌.. రెండో వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 పరుగులు సాధించి భారత్‌ ఘన విజయం  సాధించడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును సైతం అందుకున్నాడు. ( ఇక్కడ చదవండి: కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత)

అయితే మ్యాచ్‌ తర్వాత మాట్లాడిన రాహుల్‌..‘ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అది నాకు గొప్ప చాలెంజ్‌గా భావిస్తున్నా. ఒక జట్టుగా ఆడేటప్పుడు ప్రతీ ఒక్కరూ జట్టు కోసమే ఆడాలి. అటువంటప్పుడు ఫలానా స్థానంలో రావాలనే నాకు లేదు. ఎక్కడైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒత్తిడిని పెట్టుకోను. స్వేచ్ఛగా ఆడటానికే ప్రాధాన్యత ఇస్తా. ఎంజాయ్‌ చేస్తూ గేమ్‌ ఆడటమే నాకు తెలుసు’ అని రాహుల్‌ తెలిపాడు. ఇక తన మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ ప్రిపరేషన్‌కు పలువురు మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాళ్ల వీడియోలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నాడు. అందులో విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ వీడియోలను ఎక్కువగా చూసినట్లు రాహుల్‌ తెలిపాడు. మిడిల్‌ ఆర్డర్‌లో తన బ్యాటింగ్‌ మెరుగు కావడానికి ఆ వీడియోలు సహకరించాయన్నాడు. ( ఇక్కడ చదవండి: రిషభ్‌ పరిస్థితి ఏమిటి?)

>
మరిన్ని వార్తలు