షేన్‌ వాట్సన్‌కు కీలక పదవి

12 Nov, 2019 11:15 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆసీస్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షేన్‌ వాట్సన్‌కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఏసీఏ) హెడ్‌గా వాట్సన్‌ నియమించారు. ఈ మేరకు  వాట్సన్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ సోమవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో నిర్ణయం  తీసుకున్నారు. ఆసీస్‌ తరఫున ఆడిన సమయంలో తనదైన మార్కుతో ఎన్నో  విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన వాట్సన్‌పై నమ్మకం ఉంచి ఏజీఎం సభ్యులు.. సరికొత్త బాధ్యతను కట్టబెట్టారు.

దాంతో షేన్‌ వాట్సన్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభం కానుంది. దీనిపై వాట్సన్‌ మాట్లాడుతూ..‘ ఇది నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. దాంతో పాటు ఇదొక పెద్ద బాధ్యత కూడా. ఆసీస్‌ క్రికెటర్ల నమ్మకాన్ని మరోసారి చూరగొంటా. నాకు ఆస్ట్రేలియా క్రికెట్‌ ఏమైతే ఇచ్చిందో దాన్ని తిరిగి ఈ రూపంలో తీర్చుకోవడానికి మంచి అవకాశం’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్‌లో 59 టెస్టులు ఆడిన  వాట్సన్‌, 190 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు విశేషమైన సేవలందించాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్‌ బోర్డులోని సభ్యులను 10 మందికి పెంచుతూ ఏజీఎం నిర్ణయం తీసుకుంది. ఇందులో మూడు కొత్త ముఖాలకు తొలిసారి అవకాశం కల్పించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు