వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

19 Sep, 2017 00:28 IST|Sakshi
వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

మితిమీరి మద్యం తాగి వాహనం నడిపినందుకు ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం విధించారు. అలాగే స్వచ్ఛందంగా 100 గంటల సామాజిక సేవ కూడా చేయాలని స్థానిక  మెజిస్ట్రేట్స్‌ కోర్టు ఆదేశించింది. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌)లో ఎవర్టన్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న  31 ఏళ్ల రూనీ ఈ నెల 1న అధిక స్థాయిలో మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇంగ్లండ్‌ నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఆల్కహాల్‌ స్థాయి 35 మైక్రోగ్రామ్‌లు ఉండాల్సి ఉండగా... రూనీకి మాత్రం బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టులో అది 104 మైక్రోగ్రామ్‌లుగా తేలింది.   
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

పంట పొలాల్లో ‘మహర్షి’ బృందం

‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది