బాహుబలులను పంపుతున్నాం: రష్యా

26 Jan, 2018 19:24 IST|Sakshi

శీతాకాల ఒలింపిక్స్‌కు సిద్ధమైన రష్యా అథ్లెట్స్

మాస్కో: ఒలింపిక్స్‌లో పతకాలు గెలవటంలో పోటీపడే దేశాలలో రష్యా ఒకటి. అయితే దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొంటుందా లేదా అనేది సగటు క్రీడాభిమానులకు కలిగిన సందేహం. గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. శీతాకాల ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొనటంపై ఎందుకింత చర్చ అనుకుంటున్నారా.. రియో ఒలింపిక్స్‌లో కొంత మంది ఆటగాళ్లు డోపింగ్‌లో పట్టుబడంటంతో  రష్యా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొంటుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నామని రష్యా ప్రకటించింది.

రష్యా ప్రకటనతో ఒలింపిక్‌ అభిమానుల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఎందుకంటే ఒలింపిక్‌లో రష్యా అథ్లెట్స్‌ ప్రదర్శన అలాంటిది. అథ్లెట్స్‌ సంఖ్య తగ్గినా పతకాలు తెచ్చే 169మంది బాహుబలులను పంపుతున్నామని రష్యా ప్రకటించింది. ఈ సంఖ్య గతంలో జరిగిన ఒలింపిక్స్‌ పోటీలకు పంపిన అథ్లెట్ల కంటే తక్కువే ఉంది. రియో ఒలింపిక్స్‌కి 232 మందిని, వాంకోవర్‌ ఒలింపిక్స్‌కి 177 మందిని పంపింది.

రష్యా అథ్లెట్లను శీతాకాల ఒలింపిక్స్‌కి పంపకపోతే ఆ దేశ జెండా, జాతీయ గీతం ప్రదర్శనలో ఉండబోదని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) ముందే హెచ్చరించింది. ఒలింపిక్స్‌ ప్యానెల్‌ నిర్వహించే డోపింగ్‌ పరీక్షలోనూ నెగ్గాలని, లేకపోతే ఆదేశం నిర్వహిం‍చిన పరీక్షలపై అనుమానాలు కలిగే అవకాశం ఉంటుందని ఐఓసీ తెలిపింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా