‘అభిమానులు లేకుండా ఆడటానికి ఓకే’

30 Apr, 2020 11:39 IST|Sakshi

క్రీడా ఈవెంట్లను క్లోజ్డ్‌ డోర్స్‌లో జరపడంలో తప్పులేదు

లాక్‌డౌన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా:  రహానే

న్యూఢిల్లీ: ఎవరూ ఊహించని కరోనా వైరస్‌తో ప్రపంచమంతా సతమతమవుతుందని టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంక్షోభంలో అంతా కలిసి కట్టుగా ఉండి మనం చేసే పనుల్లో అత్యంత జాగ్రత అవసరమన్నాడు. ప్రధానంగా ఓపికతో పాటు సానుకూల ధోరణితో కరోనా మహమ్మారిని తరిమికొట్టాలన్నాడు. రేపటి భవిష్యత్తు కోసం నేటి పనుల్లో సంయమనం పాటించాలన్నాడు.  ఇక కరోనా వైరస్‌తో ఐపీఎల్‌పాటు మిగతా క్రీడా ఈవెంట్లన్నీ రద్దు కావడంపై రహానే స్పందించాడు.(అతని కంటే మాలికే బెటర్‌: చహల్)

 ‘ఐపీఎల్‌ కానీ మిగతా  వేరే క్రీడలను కానీ జరిపించాలంటే అభిమానులు లేకుండా చూడాలి. ఫ్యాన్స్‌ లేకుండా క్రీడా ఈవెంట్లు జరగడం మనకు కొత్త కాదు. మన దేశవాళీ క్రికెట్‌లో అభిమానులు లేకుండా మ్యాచ్‌లు ఆడటం చూశాం. అభిమానులు లేకుండా మనం లేము.. కానీ ఈ పరిస్థితుల్లో అభిమానులు అవసరం లేదు. వారి ఆరోగ్యం చాలా ముఖ్యం. క్లోజ్డ్‌ డోర్స్‌లో మ్యాచ్‌లు జరిపితే నాకు అభ్యంతరం లేదు. కానీ ఫ్యాన్స్‌ మాత్రం వద్దు. అభిమానులు ఇంటి వద్దే మ్యాచ్‌లు చూస్తారు’ అని రహానే తెలిపాడు.

ఇక దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ గురించి రహానే మాట్లాడుతూ.. ‘ ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని నేను నా భార్య, కూతురితో కలిసి ఆస్వాదిస్తున్నాను. సాధ్యమైనంత వరకూ సానుకూల ధోరణితో ఉండటానికి యత్నిస్తున్నా. నా భార్య, కూతురితో ఎక్కువ సమయం ఇంట్లో ఉండటానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నా. ఇక్కడ నా భార్యకు కుకింగ్‌, క్లీనింగ్‌ విషయాల్లో సాయపడుతున్నా. నా కరాటే స్కిల్స్‌ను బయటకు తీస్తున్నా. ఇది నా ఫిట్‌నెస్‌కు అనుకూలిస్తుంది. నేను చాలా ఎంజాయ్‌ చేస్తున్నా’ అని రహానే తెలిపాడు.(షోయబ్‌ అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు)

>
మరిన్ని వార్తలు