ఆ స్థానాలపై దృష్టి:ధోని

18 Oct, 2015 23:11 IST|Sakshi
ఆ స్థానాలపై దృష్టి:ధోని

రాజ్ కోట్: దక్షిణాఫ్రితో జరిగిన మూడో వన్డేలో చివరి వరకూ పోరాడి ఓటమి చెందడం పట్ల టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిరాశ వ్యక్తం చేశాడు. చివర్లో వికెట్ బాగా స్లోగా మారడంతో ఓటమి చెందామన్నాడు. మిడిల్ ఆర్డర్ లో ఆటగాళ్ల కూర్పు ఇప్పటికీ కుదురుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ధోని పేర్కొన్నాడు. ప్రత్యేకించి ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై ప్రస్తుతం దృష్టి నిలిపినట్లు తెలిపాడు. థర్డ్ డౌన్ లో అజింకా రహానే బ్యాటింగ్ బాగా చేస్తున్నప్పటికీ విరాట్ విఫలం అవుతున్నాడన్నాడు. ఆ కారణం చేతనే విరాట్ ను ముందుకు తీసుకొచ్చినట్లు ధోని తెలిపాడు. మూడో స్థానం బ్యాటింగ్ ఆర్డర్  అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నాడు.

 

ఇదిలా ఉండగా సెంచరీతో ఆకట్టుకున్న డీ కాక్ తనపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పాడని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఈరోజు గెలుపులో డీ కాక్ కీలక పాత్ర పోషించడానికి ఏబీ అన్నాడు. 37 ఓవర్ల నుంచి 44  ఓవర్ల వరకూ తమ ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నాడు.

>
మరిన్ని వార్తలు