‘అతిపెద్ద విజయం’పై స్పందించిన కెప్టెన్‌

21 Feb, 2019 11:45 IST|Sakshi

బార్బాడాస్‌: వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌..వన్డే సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది.  వెస్టిండీస్‌ నిర్దేశించిన 361 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్‌ ఇంకా ఎనిమిది బంతులు ఉండగానే ఛేదించి ‘అతి పెద్ద’ విజయాన్ని అందుకుంది. ఇది ఇంగ్లండ్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలో అతి పెద్ద ఛేజింగ్‌గా నమోదైంది. గతంలో ఇంగ్లండ్‌ ఎప్పుడూ వన్డే ఫార్మాట్‌లో 350కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు.

జాసన్‌ రాయ్‌(123, జో రూట్‌(102)ల సెంచరీలకు తోడు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(65) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ భారీ లక్ష్యాన్ని ఏ మాత్రం కష్టపడకుండా ఛేదించింది. దీనిపై మ్యాచ్‌ తర్వాత మోర్గాన్‌ మాట్లాడుతూ.. ‘ మా బ్యాటింగ్‌పై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. పెద్ద పెద్ద లక్ష్యాలను ఛేదించే సత్తా మాలో ఉంది. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆరంభం నుంచి దూకుడుగానే ఆడాం. బ్యాటింగ్‌లో కచ్చితమైన ప్రణాళికలు అమలు చేశాం. జాసన్‌ రాయ్‌, రూట్‌ల ప్రదర్శన నిజంగా అసాధారణం. మేము ఎక్కడ ఒత్తిడిలో పడిన సందర్భం లేదు. ఆది నుంచి కడవరకూ రన్‌రేట్‌ను కాపాడుకుంటూ వచ్చాం. విండీస్‌ బౌలర్లు ఎంతటి మంచి బంతిని సంధించినా దాన్ని ఫోర్‌గానో, సిక్స్‌ గానో మలచి వారినే ఒత్తిడిలోకి నెట్టాం’ అని మోర్గాన్‌ పేర్కొన్నాడు.

ఇక‍్కడ చదవండి: పాక్‌ క్రికెటర్‌ రికార్డును బద్దలు కొట్టిన గేల్‌

మరిన్ని వార్తలు