భారత్‌ను తరచుగా ఓడించేవాళ్లం: ఇమ్రాన్‌ ఖాన్‌

24 Jan, 2020 09:12 IST|Sakshi

దావోస్‌: భారత క్రికెట్‌ జట్టును ఎన్నోసార్లు తమ జట్టు ఓడించిందంటూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..తాను క్రికెట్‌ ఆడే సమయంలో ఎన్నోసార్లు భారత్‌ను ఓడించామని అన్నారు. పరిమాణంలో తమ కంటే 7 రెట్లు పెద్ద దేశమైన భారత్‌ను తరచూగా ఓడించేవాళ్లమంటూ, అప్పట్లో హాకీ, ఇతర క్రీడలలో పాక్‌ అద్భుతంగా రాణిస్తుండేదని పేర్కొన్నారు.  

అప్పట్లో ఓడిన జట్టుకు ఏ బహుమతి ఇచ్చేవారు కాదని, కనీసం సానుభూతి చూపేవారు కాదని ఇమ్రాన్‌ అన్నారు.  తాను రాజకీయాల్లోకి రాగానే కొందరు నవ్వారని..కానీ తానెప్పుడు లక్ష్యాన్ని వదిలిపెట్టలేదన్నారు. దేశంలో అనేక సహజ వనరులున్నాయని..సులభతర వాణిజ్య సూచీలో మెరుగైన స్థానాన్ని పొందడమే తమ లక్ష్యమన్నారు. 1960లో పాకిస్తాన్‌ చాలా అద్భుత దేశమని..ఆసియా దేశాలకు ఆదర్శంగా నిలిచేదని చెప్పుకొచ్చారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా తమ దేశంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిందని..సైన్యం అధికారంలోకి తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు. దేశంలో మంచి పరిపాలన అందించగలిగితే పాకిస్తాన్‌ అభివృద్ధి చెందడం ఖాయమని ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డారు.

చదవండి: ఇమ్రాన్‌పై ఒవైసీ ఫైర్‌

మరిన్ని వార్తలు