వుయ్‌ డోంట్‌ కేర్‌: రవిశాస్త్రి

25 Dec, 2017 12:58 IST|Sakshi

ముంబై:తమ జట్టు ఎప్పుడూ టీ 20 క్రికెట్‌ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదని టీమిండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. క్రికెట్‌లో భాగమైన టీ 20 ఫార్మాట్‌ కోసం హైరానా అనేది అనవరసమన్నాడు. ఇక్కడ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండటమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో మూడో టీ20లో విజయం సాధించిన తరువాత మాట్లాడిన రవిశాస్త్రి.. 'మేము ఎప్పుడూ ప్రత్యర్థి జట్టుకు గౌరవం ఇస్తాం. అలా అవతలి జట్టుకు గౌరవం ఇచ్చినప్పుడే ఫీల్డ్‌లో నిలబడతాం. అది ఒక మంచి జట్టు యొక్క లక్షణం కూడా. కాకపోతే టీ 20 క్రికెట్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా సైడ్‌ నుంచి చూస్తే టీ 20 క్రికెట్‌ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ గెలుపు-పరాజయాలు అనేవి విషయం కాదు. మా లక్ష్యం ఒక్కటే యువకులకు అవకాశాలు కల్పించడం. ఆ క్రమంలోనే 2019 నాటికి ఒక అత్యుత్తమ జట్టును తయారు చేయడం. వీటిపైనే మా దృష్టి.  టీ 20 క్రికెట్‌ అనేది 'డోంట్‌ కేర్‌' అని రవిశాస్త్రి కాస్త ఘాటుగా స్పందించాడు.

దీనిలో భాగంగా బౌలింగ్‌లో ఆకట్టుకున్న ఉనాద్కత్‌ పై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఉనాద్కత్‌ బౌలింగ్‌ చాలా విభిన్నంగా ఉందని కొనియాడాడు. లంకతో సిరీస్‌తో ద్వారా ఉనాద్కత్‌ తన బౌలింగ్‌ విలువ గురించి తెలుసుకున్నాడన్నాడు. ఇదే సమయంలో లంకతో టీ 20ల్లో భాగంగా వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు చేసిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను ఆకాశానికెత్తేశాడు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి పరిణితి సాధించాడంటూ కితాబిచ్చాడు. అతనొక క్లాస్‌ ఆటగాడని, అన్ని రకాల షాట్లు ఆడగల సత్తా ఉన్నవాడన్నాడు.

మరిన్ని వార్తలు