మా సంఘానికి ఐఓఏ గుర్తింపు ఉంది

15 Aug, 2019 10:11 IST|Sakshi

ఓఏటీ అధ్యక్షుడు రంగారావు స్పష్టీకరణ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకే హక్కు ఉందంటూ... మాదంటే మా సంఘానికే భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) గుర్తింపు ఉందంటూ గత కొంతకాలంగా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (ఓఏటీ), తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (టీఓఏ) మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఐఓఏ నియమించిన కమిటీ సభ్యుడైన నామ్‌దేవ్‌ షిర్గావోంకర్‌ ఆధ్వర్యంలో నిజాం కాలేజి వేదికగా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ సమావేశం జరిగింది. ఓఏటీ అధ్యక్ష కార్యదర్శులైన ప్రొఫెసర్‌ కె. రంగారావు, పి. ప్రకాశ్‌ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓఏటీ ఏర్పాటు జరిగిన విధానాన్ని నామ్‌దేవ్‌కు వివరించారు.  ఐఓఏ నార్మ్, సొసైటీస్‌ యాక్ట్‌ చట్టాలకు అనుగుణంగా ఐఓఏ పరిధిలోనే 2015లో చట్టబద్ధంగా తమ సంఘాన్ని ఏర్పాటు చేశామని రంగారావు తెలిపారు. ఐఓఏ పరిధిలోనే తాము క్రీడా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఓఏటీకి చట్టబద్ధత ఉందని అన్నారు.

మరోవైపు ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీఓఏ అధ్యక్షుడు ఏపీ జితేందర్‌ రెడ్డి తమ వైపు వాదనలను ఐఓఏ సభ్యుడు నామ్‌దేవ్‌కు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న నామ్‌దేవ్‌ ఈ విషయాన్ని ఐఓఏ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ వివాదం పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఏటీ సభ్యులైన అబ్బాస్‌ కీర్మాణి, ఎస్‌ఆర్‌ ప్రేమ్‌రాజ్, పాణిరావు, మహేశ్‌ కుమార్, ఫల్గుణ, అశోక్‌ కుమార్, శ్రీశైలం, దీక్షిత్, లక్ష్మీకాంతం.... టీఓఏ ప్రతినిధులు కె. జగదీశ్వర్‌ యాదవ్,  తదితరులు పాల్గొన్నారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రిషికేత్‌ మరో డబుల్‌ సెంచరీ

న్యూజిలాండ్‌ 203/5

మూడో వన్డే : విండీస్‌పై భారత్‌ విజయం

దీపక్‌కు స్వర్ణం

విండీస్‌ 240/7

అసభ్య ప్రవర్తన.. టీమిండియా మేనేజర్‌పై వేటు!

కుల్దీప్‌పై వేటు.. చహల్‌కు చోటు

సచిన్‌కు బీసీసీఐ మైమరిపించే ట్వీట్‌

కోచ్‌ ప్రకటనకు ముహూర్తం ఖరారు!

స్టెయిన్‌ అసహనం.. కోహ్లికి క్షమాపణలు

పరాజయంతో పునరాగమనం

విజేత హర్ష భరతకోటి

ఇంగ్లండ్‌కు మరో పరీక్ష

సిరీస్‌పై గురి

దక్షిణాఫ్రికా కీలక నిర్ణయం.. సారథిగా డికాక్‌

‘ఇస్మార్ట్‌’ క్రికెట్‌

‘అయ్యారే..’ మనోళ్ల అద్భుత డైవింగ్‌ చూశారే..!

24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌లో క్రికెట్‌!

ఆ చాన్స్‌ నాకు ఎవరిస్తారు?: సెహ్వాగ్‌

‘యావత్‌ పాకిస్తాన్‌ మీకు అండగా ఉంటుంది’

2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌?

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

అద్భుతాలు ఆశించొద్దు: ఆర్చర్‌

హేయ్‌ పీటర్సన్‌.. సైలెంట్‌ అయ్యావే?: యువీ

హెడ్‌ కోచ్‌ తుది జాబితాలో ఆరుగురు

ఆసియా సెయిలింగ్‌ పోటీలకు ప్రీతి

క్వార్టర్స్‌లో హకీమ్, అపూర్వ

తెలంగాణ రాష్ట్ర చెస్‌ జట్టులో ఉమేశ్, కీర్తి

వారియర్స్‌తో ‘టై’టాన్స్‌

శ్రేయస్‌ అయ్యర్‌ బాగా ఆడాడు: కోహ్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!

రష్మికకు షాక్‌ ఇచ్చిన కియారా..?

మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

వారికి శర్వానంద్‌ ఆదర్శం

దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి

స్వాతంత్య్రానికి సైరా