వెస్టిండీస్‌ చెత్త రికార్డు

26 Aug, 2019 11:15 IST|Sakshi

ఆంటిగ్వా:  వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ తన  రెండో ఇన్నింగ్స్‌లో వంద పరుగులకే ఆలౌటైంది. బుమ్రా ఐదు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించగా, ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరొకవైపు షమీ రెండు వికెట్లు సాధించాడు. కాగా, విండీస్‌ వంద పరుగులకే చాపచుట్టేయంతో చెత్త గణాంకాలను నమోదు చేసింది. (ఇక్కడ చదవండి: భారత్‌ ఘన విజయం)

ఇప్పటివరకూ భారత్‌తో ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో విండీస్‌కు ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది. అంతకుముందు 2006లో కింగ్‌స్టన్‌లో 103 పరుగులకు ఆలౌటైన విండీస్‌.. ఈసారి వంద పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా భారత్‌పై విండీస్‌ నమోదు చేసిన అత్యల్ప స్కోర్లలో తాజా ఇన్నింగ్స్‌ తొలి స్థానాన్ని ఆక్రమించింది.   మరొకవైపు భారత్‌ 318 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా విండీస్‌ జట్టుపై భారత్‌కిదే అత్యుత్తమ విజయం. 1988 జనవరిలో చెన్నైలో జరిగిన టెస్టులో విండీస్‌పై 255 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును భారత్‌ సవరించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా