విండీస్‌తో టీ20.. వర్షం అంతరాయం..!

6 Aug, 2019 20:32 IST|Sakshi

కోహ్లికి విశ్రాంతి..!

జార్జ్‌టౌన్‌ (గయానా): మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు వరుస మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా 2–0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇక ప్రావిడెన్స్‌ స్టేడియంలో జరుగనున్న చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని ఆథిత్య జట్టు పథకాలు రచించింది. అయితే, ఈ మ్యాచ్‌కూ వరుణుడు అంతరాయం తప్పలేదు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు టాస్‌ వేయాల్సి ఉండగా.. వర్షం కారణంగా ఆలస్యమైంది. పిచ్‌, ఔట్‌ఫీల్డ్‌పై కవర్లు కప్పి ఉంచారు. ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, బ్రాత్‌వైట్‌తో చర్చించిన అనంతరం 8:30 గంటల తర్వాత టాస్‌ వేసే అవకాశముందని అంపైర్లు ప్రకటించారు. స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లికి జట్టు యాజమాన్యం ఈ మ్యాచ్‌లో విశ్రాంతినివ్వొచని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రెండో టీ20కి వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో టీమిండియా 22 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

(చదవండి : మార్పులు చేర్పులతో...)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా