టీమిండియాను చిత్తుగా ఓడించిన కరీబియన్‌ జట్టు

15 Dec, 2019 21:56 IST|Sakshi

తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ ఘనవిజయం

హెట్‌మెయిర్‌, షై హోప్‌ సెంచరీలు

చెన్నై: తొలి వన్డేలో వెస్టిండీస్‌ టీమిండియాకు షాకిచ్చింది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన విండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) రికార్డు ఇన్నింగ్స్‌కు తోడు షై హోప్‌ (151 బంతుల్లో 102 పరుగులు, 7 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించడంతో పర్యాటక జట్టు అలవోక విజయం సాధించింది. నికోలస్‌ పూరన్‌ (23 బంతుల్లో 29 పరుగులు, 4ఫోర్లు) జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన కరీబియన్‌ జట్టు మరో 13 బంతులు మిగిలి ఉండగానే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో విండీస్‌ 1-0తో ఆదిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో దీపక్‌ చహర్‌, మహ్మద్‌ షమీ తలో వికెట్‌ తీశారు.
(చదవండి : జడేజా రనౌట్‌పై వివాదం.. కోహ్లినే వచ్చేశాడు!)

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు శ్రేయాస్‌ అయ్యర్ (88 బంతుల్లో 70 పరుగులు, 5 ఫోర్లు, ఒక సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (69 బంతుల్లో 71 పరుగులు, 7 ఫోర్లు, 1సిక్స్‌) మెరుగైన ప్రదర్శన చేయడంతో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 36, కేదార్‌ జాదవ్‌ 40 ఫరవాలేదనిపించారు. 21 బంతుల్లో 21 పరుగులు చేసిన జడేజా రనౌట్‌ కావడంతో టీమిండియా చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. లోకేష్‌ రాహుల్ 6‌, కెప్టెన్‌ కోహ్లి 4 విఫలమయ్యారు. ఈ ఇద్దరినీ ఒకే ఓవరల్లో ఔట్‌ చేసి కరీబియన్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ టీమిండియాకు షాకిచ్చాడు. కీమో పాల్‌, అల్జారీ జోసెఫ్‌ తలో రెండు వికెట్లు తీశారు. ఇక టీమిండియా తడబడిన పిచ్‌పై విండీస్‌ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడటం విశేషం. తదుపరి వన్డే డిసెంబర్‌ 18న విశాఖపట్నంలో జరుగనుంది.
(చదవండి : అయ్యర్‌ మళ్లీ కొట్టేస్తే.. పంత్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు)
(చదవండి : హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు