పాకిస్థాన్‌పై వెస్టిండీస్ విజయం

17 Jul, 2013 14:06 IST|Sakshi
పాకిస్థాన్‌పై వెస్టిండీస్ విజయం

పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా వెస్టిండీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ గేల్ విఫలమైనప్పటికీ, ఛార్లెస్ (31) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం డారెన్ బ్రావో(54), డ్వేన్ బ్రావో(43) పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరును అందించారు. మిడిల్ ఆర్డర్‌లో పొలార్డ్ (30) పరుగులు చేయడంతో వెస్టిండీస్ నిర్ణీత 232 పరుగులు చేసింది.

తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్థాన్‌కు నాసిర్ జంషేడ్(54)పరుగులతో శుభారంభాన్నిచ్చాడు. కాగా పాకిస్థాన్ ఆటగాళ్లు నిలకడలేమితో వరుస వికెట్లు చేజార్చుకున్నారు. ఓ దశలో ఉమర్ అక్మల్ (50) పరుగులతో ఆదుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. కేవలం 195 పరుగుల మాత్రమే చేసిన పాక్‌కు ఓటమి తప్పలేదు. వెస్టిండీస్ బౌలర్లలో నరీన్ నాలుగు వికెట్లు తీసి పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు.

మరిన్ని వార్తలు