భారత్ వైట్వాష్

12 Dec, 2016 14:52 IST|Sakshi
భారత్ వైట్వాష్

మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడు ట్వంటీల సిరీస్లో భారత్ వైట్వాష్ అయ్యింది. మంగళవారం ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మూడో టీ 20లో భారత మహిళలు 15 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. దాంతో మూడు టీ 20ల సిరీస్ను భారత్ 0-3 తేడాతో విండీస్కు అప్పగించింది. విండీస్ విసిరిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత మహిళలు చతికిలబడ్డారు.భారత్ 20.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి పరాజయం చెందింది.

 

భారత్ ఆదిలోనే ఓపెనర్ వెల్లా వనిత వికెట్ ను స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే కోల్పోయింది.అనంతరం ఫస్ట్ డౌన్ క్రీడాకారిణి మందనా(6), మేఘనా సింగ్(19)లు కూడా నిష్ర్కమించడంతో భారత్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తరుణంలో వేదా కృష్ణమూర్తి(31 నాటౌట్),హర్మన్ ప్రీత్ కౌర్(60 నాటౌట్)లు పోరాడినా భారత్ను గెలిపించలేకపోయారు.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్లు హేలే మాథ్యూస్(47), స్టెఫానీ టేలర్(44) మంచి ఆరంభాన్నిచ్చారు.తొలి వికెట్ కు 61పరుగులు భాగస్వామ్యం చేసి విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.అంతకుముందు జరిగిన వన్డే సిరీస్లో భారత్ 3-0 తో విండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

 

>
మరిన్ని వార్తలు