వాటే ప్లాన్‌ చైనా: భజ్జీ

29 May, 2020 16:25 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తి చైనా  పన్నాగమే..

ఆధిపత్యం కోసం చెత్త ప్లాన్‌లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పుట్టకకు కారణం చైనానే అని టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ధ్వజమెత్తాడు. కరోనా వైరస్‌ను సృష్టించి ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలనేది చైనా ప్రణాళికలో భాగమేనని భజ్జీ విమర్శించాడు. ఇది చైనా పన్నిన పక్కా కుట్ర అంటూ విరుచుకుపడ్డాడు. ఆధిపత్యం కోసం చైనా వేసిన ఒక చెత్త ప్లాన్‌ అంటూ ఆరోపణలు గుప్పించాడు. ఈ మేరకు శుక్రవారం తన అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో చైనాను కడిగేశాడు భజ్జీ. ‘ చైనా వాటే ప్లాన్‌. కరోనా వైరస్‌ను ప్రపంచపైకి వదిలి దేశాల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం మీ ప్రణాళికలో భాగమే. ప్రతీ ఒక్కరూ సమస్యలు బారిన పడితే మీరు హాయిగా కూర్చొని చూడొచ్చనే ప్లాన్‌ వేశారు.(మా మధ్య అభిప్రాయ బేధాల్లేవ్‌:దీపికా పల్లికల్‌)

మీకున్న అధికార దాహమే ఈ కరోనా వైరస్‌ పుట్టడానికి కారణం. పీపీఈ కిట్స్‌, మాస్క్‌లు తదితర వస్తువులు తయారు చేసి ప్రపంచానికి సప్లై చేయాలనుకున్నారు. తద్వారా మీ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుని అగ్రగామిగా ఎదగడానికి ప్రణాళిక చేశారు. ఆధిపత్యం కోసం అన్వేషణలో కరోనా వైరస్‌ ఆలోచన చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం చైనాలో నమోదైన కొత్త కరోనా వైరస్‌ కేసులు ఏమీ లేవంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని రీట్వీట్‌ చేస్తూ ఈ విమర్శలు చేశాడు భజ్జీ.  కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ సైతం షోయబ్‌ అక్తర్‌ కూడా చైనాపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ పుట్టకకు కారణం చైనానే అంటూ విమర్శలు చేశాడు. చైనా ప్రజలు ప్రతీ అడ్డమైన పదార్థాలను తిని కరోనా వైరస్‌ను తీసుకొచ్చారని మండిపడ్డాడు. అసలు చైనా ప్రజలకు గబ్బిలాలను తినడంతో పాటు వాటి రక్తాన్ని కూడా తాగడం వంటి చేయడంతో పాటు కుక్కల్ని, పిల్లుల్ని తింటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. (‘నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్‌ అన్నారు’)

>
మరిన్ని వార్తలు