‘గేల్‌.. నిన్ను మిస్సవుతాం’

5 Jul, 2019 16:23 IST|Sakshi

లీడ్స్‌:  వరల్డ్‌కప్‌ పరంగా చూస్తే క్రిస్‌ గేల్‌ ఇదే చివరిది. దానిలో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్‌ జరిగిన మ్యాచ్‌లో గేల్‌ తన చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడేశాడు. తన చివరి మెగా టోర్నీలో గేల్‌ విఫలమయ్యాడనే చెప్పాలి. అఫ్గానిస్తాన్‌తో తన ఆఖరి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడిన గేల్‌ 7 పరుగులే చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. తొలుత వరల్డ్‌కప్‌ తర్వాత తన రిటైర్మెంట్‌ ఉంటుందని ప్రకటించిన గేల్‌.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. భారత్‌తో సిరీస్‌ ఆడిన తర్వాతే తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానంటూ స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలో గేల్‌ వీడ్కోలు అంశానికి సంబంధించి సహచర ఆటగాడు షాయ్‌ హోప్‌ మాట్లాడుతూ.. క్రికెట్‌కు గేల్‌ వీడ్కోలు చెప్పిన రోజును ఒక దుర్దినంగా అభివర్ణించాడు. ‘ గేల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన క్షణం క్రికెట్‌లో ఒక దుర్దినంగా మిగిలి పోతుంది. యావత్‌ ప్రపంచం నిన్ను కచ్చితంగా మిస్పవుతుంది’ అని పేర్కొన్నాడు.అసలు గేల్‌ నుంచి దేన్ని ప్రధానంగా కోల్పోతారని హోప్‌ను ప్రశ్నించగా.. ‘అతను పెట్టుకునే వింత వింత సన్‌ గ్లాసెస్‌ను మిస్సవుతాం’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. అదే సమయంలో గేల్‌ ఒక అసాధారణ ఆటగాడని, అతని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామన్నాడు హోప్‌. వచ్చే నెల్లో భారత్‌తో సిరీస్‌ ఆడిన తర్వాత తన రిటైర్మెంట్‌ ఉంటుందని గేల్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వదేశంలో భారత్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌లో కూడా ఆడతానని గేల్‌ తెలిపాడు.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

ఫైనల్లో పరాజితులు లేరు 

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు