జాదవ్‌ను ఆడించాలి.. ఎందుకంటే?

9 Jul, 2019 12:21 IST|Sakshi
కేదార్‌ జాదవ్‌

మాంచెస్టర్‌ : నిలకడలేమి ఆటతో జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ను న్యూజిలాండ్‌తో జరిగే సెమీస్‌ మ్యాచ్‌కు అవకాశం కల్పించాలని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాదవ్‌కు కివీస్‌పై మంచి బౌలింగ్‌ రికార్డు ఉందని, అది జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కివీస్‌ టాప్‌ బ్యాట్స్‌మెన్‌ అంతా జాదవ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తెగ ఇబ్బంది పడ్డారని, జాదవ్‌ కివీస్‌పై 9 వికెట్లు పడగొట్టాడని గుర్తు చేస్తున్నారు. మెగాసమరానికి వేదికైన ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం పిచ్‌ కూడా స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయ స్పిన్నర్‌గా జాదవ్‌ ఉపయోగపడుతాడంటున్నారు. ఏ లెక్కన చూసిన దినేశ్‌ కార్తీక్‌ కంటే జాదవ్‌ను తీసుకోవడమే ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు.

ఇక గణంకాలు కూడా జాదవ్‌ను ఎంపిక చేయడమే ఉత్తమమని తెలియజేస్తున్నాయి. కివీస్‌పై జాదవ్‌ 29 సగటు, 4.92 ఎకానమితో 9 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌, బ్యాట్స్‌మెన్‌ టామ్‌లాథమ్‌లను రెండేసి సార్లు ఔట్‌ చేశాడు. జాదవ్‌ బౌలింగ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు తెగఇబ్బంది పడ్డారు. ఈ మెంగా ఈవెంట్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన జాదవ్‌ ఒక హాఫ్‌ సెంచరీతో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. అప్గానిస్తాన్‌, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ల్లో జాదవ్‌ ఆడిన బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇవే అతన్ని శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లకు దూరం చేశాయి.

ఈఎస్‌పీన్‌ క్రిక్‌ ఇన్‌ఫో సహకారంతో

బ్యాట్స్‌మెన్‌ పరుగులు ఎదుర్కొన్న బంతులు వికెట్లు
కేన్‌ విలియమ్సన్‌

64

81 2
హెన్రీ నికోలస్‌ 32 40 1
రాస్‌ టేలర్‌ 29 40 1
టామ్‌ లాథమ్‌ 54 67 2
జిమ్మీ నీషమ్‌ 11 20 1
మిచెల్‌ సాంట్నర్‌ 11 15 1

జాదవ్‌ తీసిన 9వ వికెట్‌ కోరె అండర్సన్‌ కాగా.. ప్రస్తుతం అతను ప్రపంచకప్‌ కివీస్‌ జట్టులో లేడు.

మరిన్ని వార్తలు