ధోనికి సాధ్యం కానిది మరో కీపర్ సాధించాడు!

20 Oct, 2016 14:57 IST|Sakshi
ధోనికి సాధ్యం కానిది మరో కీపర్ సాధించాడు!

చిట్టగాంగ్: టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడైన మహేంద్రసింగ్ ధోనీకి సాధ్యంకాని రికార్డును ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఓ ఏడాది వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో వికెట్ కీపర్ గా బెయిర్ స్టో నిలిచాడు. 2000 ఏడాదిలో జింబాబ్వేకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఆండీఫ్లవర్ టెస్టుల్లో ఈ ఫీట్ (వెయ్యి పరుగులు-1045) నమోదుచేసిన తొలి కీపర్ అన్న సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్-ఇంగ్లండ్ మధ్య జరుగుతన్న తొలి టెస్టులో బెయిర్ స్టో ఓ క్యాలెండర్ ఏడాదిలో వెయ్య పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2005లో టెస్టు అరంగేట్రం చేసిన ఎంఎస్ ధోనీ టెస్టు ఫార్మాట్ కు 2014 డిసెంబర్ లో వీడ్కోలు పలికాడు. కెరీర్లో 90 టెస్టులాడిన ధోనీ 4876 పరుగులు చేయగా.. ఓ క్యాలెండర్ ఏడాదిలో ఎప్పుడూ వెయ్యి అంతకంటే ఎక్కువ పరుగులు చేయలేదు.  

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్  21 పరుగులకే  3 వికెట్లు కోల్పోయిన దశలో జో రూట్(40), మొయిన్ అలీ (63 నాటౌట్) ఆదుకున్నారు. 65 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. బెయిర్ స్టో 35 పరుగులతో మొయిన్ అలీతో పాటు క్రీజులో ఉన్నాడు.

మరిన్ని వార్తలు