‘ఆ జట్లకు కెప్టెన్సీ చేయడమే ఇష్టం’

18 May, 2020 15:50 IST|Sakshi

విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ అమోఘం

అతనే మాకు స్ఫూర్తి: అయ్యర్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏ యువ క్రికెటర్‌కైనా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని స్ఫూర్తి అని శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. కోహ్లిలోని సానుకూల ధోరణికి ప్రతీ ఒక్కరూ ఎంతో ప్రేరణ పొందుతారన్నాడు. అదే కాకుండా కోహ్లి ఎదిగిన తీరు కూడా అందరికీ ఆదర్శమన్నాడు. తనను తాను మార్చుకుంటూ ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టాప్‌లో కొనసాగుతున్న కోహ్లి నిజంగా తమ ఆటగాళ్లందరికీ ఒక చక్కటి ఉదాహరణ అని తెలిపాడు. ‘ కోహ్లినే మా యువ క్రికెటర్లకు ఉదాహరణ. అతనిలో పోరాడే తత్వం​ అందరిలో స్ఫూర్తిని నింపుతుంది. మేము కోహ్లి నుంచి చాలా నేర్చుకున్నాం. అతను ఎప్పుడూ మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉంటాడు. అతను మా పక్కన ఉంటే ఏదో తెలియని శక్తి వచ్చేస్తుంది. అతని ఆహారపు అలవాట్లు కూడా మమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. సారథిగా జట్టును ముందుకు తీసుకెళుతూనే అందర్నీ ఉల్లాసపరుస్తూ ఉంటాడు. కోహ్లి జట్టును  నడిపించే తీరు నిజంగా అద్భుతం, అమోఘం. కోహ్లి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. (ప్లీజ్‌.. మమ్మల్ని అలానే చూడండి: మంజ్రేకర్‌)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్సీ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి అవలంభించే టెక్నిక్స్‌కు నేను కూడా ఫాలో అవుతూ ఉంటా. నేను ఎప్పుడూ అండర్‌ డాగ్స్‌ జట్టుకు కెప్టెన్సీ చేయడాన్ని ఇష్టపడతా. ఇక గౌతం గంభీర్‌ నుంచి కూడా చాలా నేర్చుకున్నా. నేను ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడినప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నా. నాకు గంభీర్‌ భాయ్‌తో కెమిస్ట్రీ  బాగుంటుంది. గంభీర్‌ కేకేఆర్‌ను నడిపించిన తీరు అద్భుతం. అతను నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నా’ అని అయ‍్యర్‌ తెలిపాడు. తాను వ్యక్తిగతంగా దేన్నీ ఎక్కువ కష్టంగా భావించనని, సాధ్యమైనంత వరకూ మైండ్‌లో కొంత ప్రిపరేషన్‌తోనే గేమ్‌కు  సిద్ధమవుతూ  ఉంటానన్నాడు. పరిస్థితిని బట్టి స్పందించడం కోసం ముందుగానే ఒక ప్రణాళిక ఉంటుందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ వంటి జట్టుకు సారథ్యం  చేయడంతో తన కల నెరవేరిందన్నాడు. అండర్‌ డాగ్స్‌ జట్లకు కెప్టెన్సీ చేయడం ఇష్టమని ఈ సందర్భంగా అయ్యర్‌ తెలిపాడు. ఇక ఢిల్లీని చాంపియన్‌గా చూడాలన్నేది తన లక్ష్యమన్నాడు. (‘పీఎస్‌ఎల్‌లో కశ్మీర్‌ టీమ్‌ ఉండాలి’)

మరిన్ని వార్తలు