'జీవితంలో ఆ బంతులు వేయను'

24 May, 2016 19:05 IST|Sakshi
'జీవితంలో ఆ బంతులు వేయను'

న్యూఢిల్లీ: తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క బంతిని కూడా దూస్రా వేయలేదని టీమిండియా జింబాబ్వే సిరీస్ కు ఎంపికైన కొత్త బౌలర్ జయంత్ యాదవ్ అంటున్నాడు. వచ్చే నెలలో అక్కడ పర్యటించనున్న బృందంలో టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులోకి తొలిసారి ఎంపికైనవారు ఆరుగురు ఆటగాళ్లలో జయంత్ ఒకడు. దూస్రా ప్రయోగించలేదని, భవిష్యత్తులోనూ ఎప్పుడూ దూస్రా బంతులు వేయనని ఆఫ్ స్పిన్నర్ జయంత్ చెప్పాడు. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఎప్పుడూ కలవలేదని, అతడితో ఇంటరాక్ట్ అవ్వాలని ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

బ్యాట్స్ మెన్ ను దూస్రా ఔట్ చేస్తుందని తాను నమ్మనని, క్యారమ్ బంతులు మాత్రం సంధిస్తానంటున్నాడు. 40 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన జయంత్.. 110 వికెట్లు పడగొట్టానని, అయితే అంతర్జాతీయ మ్యాచులు ఆడి మరిన్ని వికెట్లు తీయాలని భావిస్తున్నానని చెప్పాడు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, యుజువేంద్ర చాహల్ లాంటి బౌలర్లతో తనకు కాంపిటీషన్ తప్పదని పేర్కొన్నాడు. తొలి స్పిన్నర్ గా మిశ్రా ఉంటాడని, రెండో స్పిన్నర్ కోసం తాను, చాహల్ పోటీ పడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు.

జింబాబ్వేతో వన్డే, టి20లకు జట్టు:
ఎంఎస్ ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఫైజ్ ఫజల్, మనీశ్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, రిషి ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, జస్‌ప్రీత్ బుమ్రా, బరీందర్ శరణ్, మన్‌దీప్ సింగ్, కేదార్ జాదవ్, జైదేవ్ ఉనాద్కట్, యజువేంద్ర చహల్.

మరిన్ని వార్తలు