దురదృష్టమంటే నీదే నాయనా?

21 Mar, 2019 14:39 IST|Sakshi

ఏ ఆటలోనైనా అదృష్టమనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా క్రికెట్‌లో అంపైర్ల తప్పిదాలు, క్యాచ్‌ వదిలేయడం, రనౌట్‌ మిస్‌ చేయడం ఇలాంటివి బ్యాట్స్‌మెన్‌ పాలిట ఒక్కోసారి వరాలుగా మారుతాయి. అలా ఆటగాళ్లు ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకొని భారీ స్కోర్లు సాధిస్తారు. అయితే కొన్ని సార్లు దురదృష్టం వెంటాడి బ్యాట్స్‌మన్‌ ఔటవ్వడం కూడా చూస్తుంటాం. ప్రస్తుతం అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందన్న సామెత విక్టోరియా బ్యాట్స్‌మన్‌ విల్‌ పుకౌస్సీకి వర్తిస్తుంది. మరో 18 పరుగులు చేస్తే సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో విల్‌ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు.

ఆసీస్‌లో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా సౌత్‌ ఆస్ట్రేలియా- విక్టోరియా జట్లు తలపడుతున్నాయి. ఈ తరుణంలో సౌత్‌ ఆస్ట్రేలియా పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ హెడ్‌ వేసిన బంతిని షార్ట్‌ లెగ్‌లో ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవడంతో అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున​ ఫీల్డర్‌ కాలికి తగిలి కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నిరాశగా విల్‌ క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌ చేస్తోంది. ‘దురదృష్టమంటే నీదే నాయనా?’ అంటూ దీనిపై నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 
(వాట్‌ ఏ క్యాచ్‌.. ఇది టీమ్‌ వర్క్‌ అంటే!)

మరిన్ని వార్తలు