డివిలియర్స్ బతికిపోయాడు!

24 Mar, 2015 09:51 IST|Sakshi
డివిలియర్స్ బతికిపోయాడు!

ఆక్లాండ్: అసలే డివిలియర్స్.. ఇక అతడికి రెండు లైఫ్ లు ఇస్తే ఊరుకుంటాడా. డివిలియర్స్ కు జీవనదానం చేసిన కివీస్ మూల్యం చెల్లించుకుంది. రెండు లైఫ్ లను సద్వినియోగం చేసుకుని అర్ధసెంచరీ బాదాడు. 38 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో 60 పరుగులు చేసి ఆట కొనసాగిస్తున్నాడు.

114 వద్ద రోసౌ మూడో వికెట్ గా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ ఆరంభంలో ఆచాతూచి ఆడాడు. తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ నుంచి తృటిలో తప్పించుకున్నాడు. విలియమన్స్ వికెట్లను కొట్టడంలో విఫలమవడంతో డివిలియర్స్ బతికిపోయాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డివిలియర్స్ ఇచ్చిన క్యాచ్ ను విలియమన్స్ పట్టుకోలేకపోయాడు. దీంతో సఫారీ కెప్టెన్ ఊపిరి పీల్చుకున్నాడు. అర్ధసెంచరీ బాది భారీ స్కోరుకు బాటలు వేశాడు.

ప్లెసిస్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ప్రొటీస్ టీమ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. వీరిద్దరి జోరుకు వరుణుడు బ్రేక్ వేశాడు. వర్షం రావడంతో ఆట నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 38 ఓవరల్లో 216/3 స్కోరు చేసింది.

మరిన్ని వార్తలు