కివీస్ కెప్టెన్ అరుదైన ఘనత

3 Mar, 2018 12:22 IST|Sakshi
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తిచేసుకున్న కివీస్ కెప్టెన్. ఈ ఫార్మాట్లో అతివేగంగా ఈ ఫీట్ సాధించిన ఐదో క్రికెటర్ గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భాగంగా ఐదువేల పరుగులు పూర్తి చేసిన విలియమ్సన్.. న్యూజిలాండ్ తరపున అతివేగంగా ఈ రికార్డు అందుకున్న తొలి క్రికెటర్‌ అయ్యాడు.

వెల్లింగ్టన్‌లో శనివారం జరుగుతున్న వన్డేలో కివీస్ ఇన్నింగ్స్  8వ ఓవర్ ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ వేయగా.. ఓవర్ చివరి బంతిని క్లాస్ ఆటగాడు విలియమ్సన్ బౌండరీకి తరలించి ఐదువేల పరుగులు పూర్తిచేశాడు. వెస్టిండీస్ క్రికెటర్ గ్రీనిడ్జ్ (121 ఇన్నింగ్స్‌లు)ను అధిగమిస్తూ విలియమ్సన్ ఈ ఫీట్ అత్యంత వేగంగా చేరుకున్న ఐదో క్రికెటర్‌ అయ్యాడు.

ఫాస్టెస్ట్ 5000 క్లబ్ - టాప్ 5 క్రికెటర్స్ వీరే..
క్రికెటర్             -        ఇన్నింగ్స్‌లు
హషీం ఆమ్లా -     101  (104 మ్యాచ్‌లు)
రిచర్డ్స్    -          114  (126 మ్యాచ్‌లు)
విరాట్ కోహ్లి -      114  (120 మ్యాచ్‌లు)
బ్రియాన్ లారా -  118 (120 మ్యాచ్‌లు)
విలియమ్సన్ -   119  (125 మ్యాచ్‌లు)
గ్రీనిడ్జ్     -         121 (122 మ్యాచ్‌లు)

మరిన్ని వార్తలు