కేన్‌ విలియమ్సన్‌ అరుదైన ఘనత

9 Jul, 2019 16:20 IST|Sakshi

మాంచెస్టర్‌:  న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అరుదైన ఘనతను సాధించాడు. తాజా వరల్డ్‌కప్‌లో విలియమ్సన్‌ ఐదు వందల పరుగుల మార్కును చేరాడు. భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో విలియమ్సన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఐదు వందలు, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకూ రోహిత్‌ శర్మ(647), డేవిడ్‌ వార్నర్‌(638), షకీబుల్‌ హసన్‌(606), అరోన్‌ ఫించ్‌(507)లు ఉండగా, ఇప్పుడు విలియమ్సన్‌ సైతం వారి సరసన నిలిచాడు.

అదే సమయంలో ఒక వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా విలియమ్సన్‌ గుర్తింపు సాధించాడు. 2015 వరల్డ్‌కప్‌లో మార్టిన్‌ గప్టిల్‌ 547 పరుగులు సాధించి కివీస్‌ తరఫున తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానాన్ని విలియమ్సన్‌ ఆక్రమించాడు. కాగా, వరల్డ్‌కప్‌లో ఐదు వందల పరుగులు చేసిన తొలి కివీస్‌ కెప్టెన్‌గా విలియమ్సన్‌ ఘనత సాధించాడు. ఒక వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో గప్టిల్‌, విలియమ్సన్‌ తర్వాత స్థానాల్లో స్కాట్‌ స్టైరిస్‌(2007 వరల్డ్‌కప్‌-499 పరుగులు), మార్టిన్‌ క్రో(1992 వరల్డ్‌కప్‌, 456 పరుగులు), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(2007 వరల్డ్‌కప్‌-353 పరుగులు)లు ఉన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు