'మా క్రికెట్ పిచ్ లు సరైన ప్రమాణాలతో లేవు'

21 Jan, 2016 16:41 IST|Sakshi
'మా క్రికెట్ పిచ్ లు సరైన ప్రమాణాలతో లేవు'

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: తమ దేశంలోని క్రికెట్ పిచ్లు మరింత నాణ్యంగా తయారు కావాల్సిన అవసరం ఉందని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ స్పష్టం చేశాడు. అసలు సిసలైన క్రికెట్ ను తమ దేశంలో ఆడాలంటే మాత్రం కచ్చితంగా పిచ్ లు నాణ్యంగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రస్తుత కరేబియన్ పిచ్ ల్లో ప్రమాణాలు ఏమాత్రం బాగోలేదని ఈ సందర్భంగా హోల్డర్ అభిప్రాయపడ్డాడు. ఇందుకు  ప్రాంతీయంగా జరుగుతున్న సూపర్ -50 మ్యాచ్ ల్లో తక్కువ స్కోర్లు నమోదు కావడమే నిదర్శమన్నాడు.

 

తమ పిచ్ లు జీవం కోల్పోయి చాలా స్లోగా టర్న్ అవుతూ ఉంటాయన్నాడు. కొన్ని సందర్భాల్లో స్పిన్నర్లు అనుకూలంగా ఉండే తమ పిచ్ లు.. బ్యాట్స్ మెన్ కు ఎంత మాత్రం సానుకూలంగా లేవన్నాడు. ఈ తరుణంలో తమ దేశ క్రికెట్ పిచ్ ల్లో మంచి క్రికెట్ జరుగుతుందని అనుకోవడం లేదన్నాడు.  తమ దేశ క్రికెట్ లో మజా ను ఆస్వాదించాలంటే  పిచ్ ల్లో మార్పులు చేయక తప్పదన్నాడు.

మరిన్ని వార్తలు