అట్టహాసంగా వింటర్‌ ఒలింపిక్స్‌ వేడుకలు

9 Feb, 2018 20:24 IST|Sakshi
ఒలింపిక్స్‌ జ్యోతిని వెలిగిస్తున్న యూనా కిన్‌

ప్యాంగ్‌చాంగ్‌ : దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్యాంగ్‌చాంగ్‌ ఒలింపిక్‌ స్టేడియంలో కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య దక్షిణ కొరియా స్కేటింగ్‌ క్రీడాకారిణి యూనా కిన్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ జ్యోతి వెలిగించారు.  దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే యిన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మొత్తం 92 దేశాల జట్లు ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నాయి. ప్రతి దేశానికి చెందిన జట్టు ఆటగాళ్లు వేడుకల్లో పాల్గొన్నారు. తమ జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని స్టేడియంలో సందడి చేశారు. స్కీయింగ్‌, స్కేటింగ్‌, లుజ్‌, ఐస్‌ హాకీ సహా 15  క్రీడల్లో 102 ఈవెంట్లలో నిర్వాహకులు పోటీలు నిర్వహించనున్నారు. భారత్‌ నుంచి ఇద్దరు క్రీడాకారులు శివ్‌కేశవన్‌, జగదీశ్‌ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 25 వరకు వింటర్‌ ఒలింపిక్స్‌ జరగనున్నాయి. 

మరిన్ని వార్తలు