టీమిండియా లక్ష్యం 248

11 Oct, 2019 12:59 IST|Sakshi

వడోదర: దక్షణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా లక్ష్యం 248 పరుగులు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌  లారా వోల్వార్డ్ (69; 98 బంతుల్లో, 7ఫోర్లు) అర్ద సెంచరీ రాణించింది. వోల్వార్డ్‌కు తోడుగా డు ప్రీజ్‌(44), ఓపెనర్‌ లిజెల్‌ లీ(44) రాణించడంతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శిఖా పాండే, ఏక్తా బిస్త్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సఫారీ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెటుకు 76 పరుగులు జోడించిన అనంతరం లిజెల్‌ లీని పూనమ్‌ యాదవ్‌ అవుట్‌ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్‌ కీపర్‌ త్రిష చెట్టి(22) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయింది. ఆ వెంటనే వోల్వార్డ్‌ వెనుదిరగడంతో సఫారి జట్టు కష్టల్లో పడింది. ఈ క్రమంలో డు ప్రీజ్‌ బాధ్యతయుతంగా ఆడటంతో దక్షిణాఫ్రికా మంచి స్కోర్‌ చేయగలిగింది. ఇక పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో టీమిండియాకు ఈ స్కోర్‌ ఛేదించడం పెద్ద కష్టమేమి కాదని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
 

>
మరిన్ని వార్తలు