నాలుగో ర్యాంక్‌లోనే మహిళల క్రికెట్‌ జట్టు

4 Oct, 2017 01:07 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ మహిళల వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తమ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ తాజాగా వెల్లడించిన వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్‌ మూడు పాయింట్లను మెరుగుపర్చుకుని 116 పాయింట్లకు చేరింది. రెండు పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్‌ జట్టు ఆసీస్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

టాప్‌–3లో ఉండటమే తమ లక్ష్యమని కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తెలిపింది. కివీస్‌కు తమకు చాలా స్వల్ప తేడా ఉందని, రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగైన ఆటతీరును కనబరుస్తామని చెప్పింది. 2014–15, 2015–16 సీజన్‌లో ప్రదర్శన నుంచి 50 శాతం... 2016–17 సీజన్‌లో పూర్తి ఆటతీరును పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్‌ను వెలువరించారు. 

మరిన్ని వార్తలు