టీ20 ఫైనల్‌: ఆసీస్‌దే బ్యాటింగ్‌

8 Mar, 2020 12:25 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరులో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీకి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కీలక ఫైనల్‌ పోరులో ఛేదనలో ఒత్తిడి ఉంటుందున్న ఉద్ధేశంతో టాస్‌ గెలిచిన ఆసీస్‌ సారథి మెగ్‌ లానింగ్‌ బ్యాటింగ్‌ వైపే మొగ్గు చూపింది. ఇక ఇరు జట్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇక ఫైనల్‌ పోరులో టీమిండియా నయా సంచలనం షఫాలీ వర్మపైనే అందరి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌లో ఈ చిచ్చర పిడుగు ఏ రీతిలో బ్యాటింగ్‌ చేస్తుందో వేచి చూడాలి. సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఈ రోజు బర్త్‌డే. దీంతో బర్త్‌డే స్పెషల్‌ ఇన్నింగ్స్‌ ఆడాలని భావిస్తోంది. 

మరోవైపు కీలకమైన మ్యాచ్‌కు ముందు తమ స్టార్‌ ప్లేయర్‌ ఎలీస్‌ పెర్రీ గాయంతో దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బ. అయితే కెప్టెన్‌ లానింగ్, బెత్‌ మూనీ, అలీసా హీలీలతో జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఆ జట్టు ప్రధానంగా జెస్‌ జొనాసన్, మెగాన్‌ షూట్‌లపై ఆధారపడుతోంది. కాగా,  మహిళల టీ20 ప్రపంచకప్‌ గెలిచి భారత మహిళలకు వుమెన్స్‌ డే కానుక ఇవ్వాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. వరుసగా ఆరోసారి ఫైనల్‌ చేరిన ఆసీస్‌ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలవగా, భారత్‌ మొదటిసారి ఫైనల్‌ బరిలోకి దిగుతోంది. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్‌ గెలిచింది.

చదవండి:
మన క్రికెట్‌ మహిళా సైన్యం...
ఆసీస్‌ పేసర్‌కు షఫాలీ భయం!

మరిన్ని వార్తలు