వరల్డ్‌కప్‌ ఫైనల్‌: ఓపెనర్లిద్దరికీ చెరో లైఫ్‌!

8 Mar, 2020 12:59 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. చెత్త ఫీల్డింగ్‌ కారణంగా టీమిండియా ప్లేయర్స్‌ ఆసీస్‌ ఓపెనర్లిద్దరికీ అవకాశం ఇచ్చారు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే దొరికిన అవకాశంతో అలీసా హీలీ, బెత్‌ మూనీలు రెచ్చిపోతున్నారు. ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో అలీసా హీలీ, బెత్‌ మూనీలు బ్యాటింగ్‌కు దిగారు. దీప్తి శర్మ వేసిన తొలి ఓవర్‌లో హీలీ అటాకింగ్‌కు దిగింది. వరుస ఫోర్లతో రెచ్చిపోయింది. 

అయితే  తొలి ఓవర్‌ల ఐదో బంతికి హీలీ ఇచ్చిన క్యాచ్‌ను షఫాలీ వర్మ జారవిడిచింది. దీంతో హీలీకి తొలి అవకాశం దక్కింది. హీలి ఇచ్చిన క్యాచ్‌ నేలపాలు చేసిని సమయంలో ఆమె చెసినవి 9 పరుగులు మాత్రమే. ఇక టీమిండియా మరో చెత్త ఫీల్డింగ్‌ కారణంగా మరో ఓపెనర్‌ బెత్‌ మూనికి కూడా లైఫ్‌ లభించింది. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో మూనీ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను రాజేశ్వరి గైక్వాడ్‌ నేలపాలు చేసింది. ఈ సమయంలో మూని స్కోర్‌ 4 పరుగులు మాత్రమే. ఇక ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఓ వైపు బౌండరీలు బాదుతూనే మరోవైపు చకచకా సింగ్స్‌లు తీస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. 

మరిన్ని వార్తలు