‘ఆ విషయంలో ఆమెకు ఫుల్‌ లైసెన్స్‌’

25 Feb, 2020 10:28 IST|Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన హర్మన్‌ సేన.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను బొల్తా కొట్టిచ్చింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిసిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా భారత టీనేజ్‌ ఓపెనర్‌ షఫాలీ దూకుడైన బ్యాటింగ్‌కు విమ​ర్శకులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రపంచకప్‌ వంటి మెగాటోర్నీలో పదహారేళ్ల షఫాలీ ఏ మాత్రం భయం బెరుకు లేకుండా ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెపై సీనియర్‌ క్రికెటర్‌ శిఖా పాండే ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. 

‘పదహారేళ్ల షఫాలీ నిజంగా ఓ అద్భుతం. ఆ వయసులో నేను క్రికెట్‌లో పూర్థి స్థాయి శిక్షణ తీసుకోలేదు. కానీ ఆమె ఏకంగా టీమిండియా తరుపున ప్రపంచకప్‌లో ఆడుతోంది. అంతేకాకుండా మా జట్టులో యంగ్‌ అండ్‌ ఫియర్‌లెస్‌ క్రికెటర్‌ షఫాలీనె. ఇక మేము ఆమె ఆటలో ఎలాంటి మార్పు కోరుకోవడం లేదు. అలాగే స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడాలి. ఈ విషయంలో షఫాలీ వర్మకు టీమ్‌మేనేజ్‌మెంట్‌ పూర్తి స్థాయిలో లైసెన్స్‌ ఇచ్చింది. మరో యంగ్‌ క్రికెటర్‌ రోడ్రిగ్స్‌ ఎంతో అనుభవం కలిగిన బ్యాటర్‌గా రాణాస్తోంది. కష్టకాలంలో ఆమె పోరాటం అద్వితీయం’అంటూ శిఖా పాండే పేర్కొన్నారు. జ్వరంతో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటుందని సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

చదవండి:
అమ్మాయిలు అదరగొట్టేశారు
ట్రంప్‌ను ట్రోల్‌ చేసిన పీటర్సన్‌, ఐసీసీ
సిగ్గు పడాల్సిందేమీ లేదు: కోహ్లి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా