చరిత్ర సృష్టించిన ఇందర్జీత్

23 Aug, 2015 15:42 IST|Sakshi
చరిత్ర సృష్టించిన ఇందర్జీత్

బీజింగ్: భారత అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ చేరిన తొలి భారత షాట్ పుటర్గా ఇందర్జీత్ రికార్డు నెలకొల్పాడు.  ఇందర్జీత్ మూడో ప్రయత్నంలో 20.47 మీటర్లు విసిరి ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ రౌండ్లో 12 మంది అథ్లెట్లు బరిలో ఉంటారు.

బీజింగ్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో 20 కిలో మీటర్ల రేస్ వాక్‌లో భారత అథ్లెట్ బల్జీందర్ సింగ్ 12వ స్థానంలో నిలిచాడు. బల్జీందర్ సింగ్ (1:21:44) టైమింగ్ నమోదు చేశాడు.

మరిన్ని వార్తలు