ఫైనల్‌ ఫిక్సింగ్‌: అనుమానం మాత్రమే

25 Jun, 2020 19:02 IST|Sakshi

కొలంబో : వన్డే ప్రపంచకప్‌-2011 ఫైనల్లో భారత్‌కు శ్రీలంక అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసిన ఆ దేశ మాజీ మంత్రి మహిదానంద అలుత్‌గమగేను పోలీసులు విచారించారు. భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందంటూ మాజీ మహిదానంద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం మహిదానందను విచారించారు. (2011 ఫైనల్‌ ఫిక్సయింది!)

‘భారత్‌, శ్రీలంక మధ్య జరిగిన ప్రపంచకప్‌-2011 ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్సయిందని నేను అనుమానం వ్యక్తం చేశాను. నా అనుమానంపై విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరాను. అంతేకాకుండా ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్సయిందని అక్టోబర్‌ 30, 2011న ఐసీసీకి ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఇచ్చాను’ అని మహిదానంద పేర్కొన్నారు. ఇక ఈ మాజీ మంత్రి ఆరోపణలను లంక మాజీ ఆటగాళ్లు ఇదివరకే ఖండించిన విషయం తెలిసందే. సర్కస్‌ మొదలైందని మహేల జయవర్దనే పేర్కొనగా.. ‘ప్రపంచకప్‌ ఫైనల్‌ను ఫిక్స్‌ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్‌ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ కుమార సంగక్కర వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.  (ఆమెతో వీలైతే కాఫీ.. కుదిరితే డేట్‌)

మరిన్ని వార్తలు