పాల్ వారసుడు ‘రెజీనా’?

14 Jun, 2014 01:17 IST|Sakshi
పాల్ వారసుడు ‘రెజీనా’?

ప్రపంచకప్ ఫలితాలపై ఆక్టోపస్ జోస్యం
 బెర్లిన్: దక్షిణాఫ్రికాలో 2010 సాకర్ ప్రపంచకప్ ఫలితాలను ముందే ఊహించి విశేష ప్రాచుర్యం పొందిన ‘ఆక్టోపస్ పాల్’ గుర్తుందా! ఇప్పుడు దాని వారసుడిగా ‘ఆక్టోపస్ రెజీనా’ బయటకు వచ్చింది. బెర్లిన్ అక్వేరియం ‘అక్వా డామ్’లో ఉంటున్న రెజీనా... బ్రెజిల్ టోర్నీలో మ్యాచ్ ఫలితాలను ముందే ఊహిస్తోంది. ఈనెల 16న పోర్చుగల్‌తో జరగనున్న మ్యాచ్‌లో జర్మనీ గెలుస్తుందని తేల్చేసింది. ఆహార పదార్థాలతో కూడిన ఓ పాత్రకు రెండు రంధ్రాలు చేసి వాటిని ఇరు దేశాల పతకాలతో కప్పి ఉంచి అక్వేరియంలో ప్రవేశపెట్టారు. అయితే జర్మనీ పతాకం ఉన్న రంధ్రం గుండా రెజీనా తన టెంటకిల్‌ను లోపలికి దూర్చింది.
 
 నిజమైన తాబేలు జోస్యం
 మరోవైపు ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ గెలుస్తుందని ఆ దేశంలోని సముద్రపు తాబేలు ‘బిగ్ హెడ్’ చెప్పిన జోస్యం నిజమైంది. బ్రెజిల్, క్రొయేషియాతో పాటు డ్రాకు సంబంధించిన పతాకాన్ని ఒక్కో చేపకు కట్టి ఉంచి తాబేలు ముందుపెట్టారు. బ్రెజిల్ పతాకం ఉన్న చేపను బిగ్ హెడ్ ఎంపిక చేసుకుంది.
 

>
మరిన్ని వార్తలు