ప్రపంచకప్‌కు కివీస్‌ జట్టు ఇదే

3 Apr, 2019 18:17 IST|Sakshi

వెల్లింగ్టన్‌: ఇంగ్లండ్‌-వేల్స్‌ వేదికగా మే 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో పాల్గనబోయే జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జాబితాను కివీస్‌ బోర్డు ఐసీసీకి పంపించింది. ఈ సారి ప్రపంచకప్‌లో పాల్గనబోయే జట్టులో అనుభవానికే పెద్దపీట వేసినట్టు బ్లాక్‌ క్యాప్స్‌ ప్రధాన కోచ్‌ గ్యారీ స్టడ్‌ తెలిపారు. సీనియర్‌ ఆటగాళ్లు రాస్‌ టేలర్‌, గుప్టిల్‌, బౌల్ట్‌, సౌథీలకు మరో అవకాశం కల్పించారు. రెగ్యులర్‌ కీపర్‌ లాథమ్‌ గతనెలలో గాయపడటంతో బ్యాకప్‌గా బ్లన్‌డెల్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

బౌల్ట్‌, సౌథీలతో పేస్‌ విభాగం బలంగా ఉంది. స్టార్‌ స్పిన్నర్‌ సాంటర్న్‌కు తోడుగా ఇష్‌ సోధీని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. విలియమ్సన్‌, టేలర్‌, లాథమ్‌, మున్రోలతో  బ్యాటింగ్‌ దుర్బేద్యంగా ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న కివీస్‌.. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా టైటిల్‌ నెగ్గాలని విలియమ్సన్‌ సేన ఆరాటపడుతోంది.

కివీస్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టామ్‌ బ్లన్‌డెల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, గ్రాండ్‌ హోమ్‌, ఫెర్గుసన్‌, మార్టిన్‌ గుప్టిల్‌, మ్యాట్‌ హెన్రీ, టామ్‌ లాథమ్‌, కోలిన్‌ మున్రో, నీషమ్‌, నిఖోలస్‌, సాంటర్న్‌, ఇష్‌ సోధీ, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌ 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు