పాక్‌ గెలుపుపై సానియా ట్వీట్‌

4 Jun, 2019 22:14 IST|Sakshi

హైదరాబాద్‌: సంచలనాలకు మారుపేరైన పాకిస్తాన్‌ మరోసారి ఎవరి అంచనాలకి అందదని నిరూపించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఘోరం ఓడిపోయిన పాక్‌ తన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుపై అనూహ్య విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఇంగ్లండ్‌పై పాకిస్తాన్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియా వేదికగా పాక్‌ జట్టుని ఆ దేశ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ట్విటర్‌ వేదికగా పాక్‌ జట్టుకు అభినందనలు తెలిపారు. 

‘పాకిస్థాన్ జట్టుకు అభినందనలు. ఓ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన అనంతరం పుంజుకుని గెలుపు బాట పట్టడం అద్భుతం. పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించలేమని అందరూ ఎందుకు అంటారో మరోసారి రుజువైంది. పాక్‌ గెలుపు బాట పట్టడంతో ప్రపంచకప్‌ మరింత ఆసక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు’అంటూ ట్వీట్‌ చేశారు. ఇక సానియా ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ‘జూన్‌ 16న జరిగే మ్యాచ్‌ ఫలితం గురించి కూడా ట్వీట్‌ చేయాలి. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో పాక్‌పై కోహ్లి సేన గెలుస్తుంది. టీమిండియాను పొగుడుతూ కామెంట్‌ చేయడం మర్చిపోకు’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

కాగా చివరిగా ఆడిన 11 వన్డేల్లోనూ పాక్‌ ఓడింది. దీంతో.. సుదీర్ఘ విరామం తర్వాత గెలుపు రుచి చూడడంతో పాక్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 16న భారత్‌-పాక్‌ల మ్యాచ్‌ జరగనుంది. అయితే ప్రపంచకప్‌లో పాక్‌పై టీమిండియా ఇప్పటివరకు ఓడిపోలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!