ఆర్చర్‌ వచ్చేశాడు 

22 May, 2019 00:35 IST|Sakshi

ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌ తుది జట్టు ఎంపిక  

లండన్‌: ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ జట్టుకు జోఫ్రా ఆర్చర్‌ ఎంపికయ్యాడు. సస్సెక్స్‌ పేసర్‌ ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో ఆకట్టుకున్నాడు. అనంతరం పాకిస్తాన్‌తో సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జన్మతః బార్బడోస్‌కు చెందిన ఈ పేసర్‌ గత మార్చిలోనే ఇంగ్లండ్‌ తరఫున ఆడేందుకు అర్హత సంపాదించాడు. ఇప్పుడు ఆలస్యంగానైనా ప్రపంచకప్‌ బెర్తు కొట్టేశాడు. అయితే ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్న పేసర్‌ డేవిడ్‌ విల్లీ, స్పిన్నర్, బ్యాట్స్‌మన్‌ జో డెన్లీలకు చోటు దక్కలేదు. ఈ నెల 30న జరిగే ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ తలపడుతుంది. దీనికంటే ముందు 25న ఆసీస్‌తో, 27న అఫ్గానిస్తాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. 

ఇంగ్లండ్‌ జట్టు: మోర్గాన్‌ (కెప్టెన్‌), జేసన్‌ రాయ్, బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ, బట్లర్, జో రూట్, టామ్‌ కరన్, బెన్‌ స్టోక్స్, డాసన్, ప్లంకెట్, ఆదిల్‌ రషీద్, జోఫ్రా ఆర్చర్, విన్సీ, వోక్స్, మార్క్‌ వుడ్‌.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌ పరాక్రమం పాక్‌ పాదాక్రాంతం

ఎదురులేని భారత్‌.. పాక్‌పై ఘన విజయం

ఆరంభం అదిరిందయ్యా.. శంకర్‌

కోహ్లి.. నువ్‌ కిరాక్‌

కోహ్లికి ఎందుకంత తొందర?

వింగ్‌ కమాండర్‌ రోహిత్‌కు సెల్యూట్‌

అదరగొట్టిన టీమిండియా: పాక్‌కు భారీ లక్ష్యం

హమ్మయ్య.. వర్షం ఆగింది

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

సచిన్‌ రికార్డును తిరగరాసిన కోహ్లి

సైమండ్స్‌ తర్వాతే మన రోహితే..

కోహ్లికి ఘనస్వాగతం పలికిన అభిమానులు

అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్‌

పాక్‌ చెత్త ఫీల్డింగ్‌.. రోహిత్‌ సేఫ్‌

పాక్‌పై టీమిండియా సరికొత్త రికార్డు

రోహిత్‌ శర్మ దూకుడు

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచు లక్ష్మి సందడి

పాక్‌ క్రికెటర్లకు ఇమ్రాన్‌ఖాన్‌ అడ్వైజ్‌ ఇదే!

భారత్‌-పాక్‌ మ్యాచ్‌: టాస్‌ పడిందోచ్‌!

ఏ వర్షం.. మాంచెస్టర్‌ను వీడొచ్చుకదా!

గూగుల్‌లో అంతా అదే వెతుకులాట!

అది మా అమ్మ కోరిక: పాక్‌ బౌలర్‌

అయితే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ లేనట్టేనా?