అప్ఘానిస్తాన్ జోరు

11 Mar, 2016 00:18 IST|Sakshi
అప్ఘానిస్తాన్ జోరు

నాగ్‌పూర్: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అప్ఘానిస్తాన్ జట్టు అదరగొట్టే ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. గురువారం గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఈ జట్టు హాంకాంగ్‌ను ఓడించింది. దీంతో 12న జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ నాలుగు వికెట్లతో చెలరేగడంతో హాంకాంగ్ పరుగులు చేసేందుకు ఇబ్బందిపడింది.

అన్షుమాన్ రాత్ (31 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్), క్యాంప్‌బెల్ (24 బంతుల్లో 27; 5 ఫోర్లు) టాప్ స్కోరర్లు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లకు 119 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు మొహమ్మద్ షెహజాద్ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), నూర్ అలీ జద్రాన్ (37 బంతుల్లో 35; 2 ఫోర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో తొలి వికెట్‌కు 70 పరుగులు సమకూరాయి. ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. క్యాంప్‌బెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు