దమ్‌నీత్‌కు రజతం

15 Jul, 2017 00:49 IST|Sakshi
దమ్‌నీత్‌కు రజతం

ప్రపంచ అండర్‌–18 అథ్లెటిక్స్‌

నైరోబి (కెన్యా): ప్రపంచ అండర్‌–18 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత కుర్రాడు దమ్‌నీత్‌ సింగ్‌ మెరిశాడు. అతను హ్యామర్‌ త్రోలో రజత పతకం గెలిచాడు. ఈ టోర్నీలో భారత్‌కిదే తొలి పతకం కావడం విశేషం. అతను హ్యామర్‌ను 74.20 మీటర్ల దూరం విసిరి రెండో స్థానం పొందాడు. మిఖాయిలో కొఖన్‌ (ఉక్రెయిన్‌– 82.31 మీటర్లు) స్వర్ణం, రాఫెల్‌ వింకెల్వోస్‌ (జర్మనీ–71.78 మీటర్లు) కాంస్యం నెగ్గారు.

బాలికల 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ హీట్స్‌లోనే వెనుదిరిగింది. రెండో హీట్‌లో పోటీపడిన జ్యోతిక శ్రీ 57.15 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 19 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందం బరిలోకి దిగింది.

మరిన్ని వార్తలు