నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్

8 Sep, 2015 00:46 IST|Sakshi

లాస్ వెగాస్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి (మంగళవారం) నుంచి జరిగే ఈ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో తమ ఒలింపిక్ బెర్త్‌లను ఖాయం చేసుకునేందుకు భారత రెజ్లర్లు సిద్ధమవుతున్నారు. గాయంతో బాధపడుతున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఈ పోటీలకు దూరమవుతుండగా.. యోగేశ్వర్ దత్, నర్సింగ్ యాదవ్, అమిత్, మౌసమ్ తదితరులు ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగుతున్నారు. పురుషుల 74కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో తలపడుతున్న 26 ఏళ్ల నర్సింగ్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ విభాగంలో సుశీల్ కుమార్ గాయంతో పాల్గొనకున్నా నర్సింగ్ పలు విజయాలు సాధించాడు. ప్రతీ కేటగిరీలో టాప్-6 స్థానాల్లో వచ్చిన వారు ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంటారు. లండన్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ (65కేజీ ఫ్రీస్టయిల్ ), అమిత్ కుమార్ (57కేజీ), మౌసమ్ ఖత్రి (97కేజీ).. మహిళల ఫ్రీస్టయిల్‌లో వెటరన్ గీతా ఫోగట్, బబిత, వినేశ్‌లపై పతకంతో పాటు బెర్త్ ఆశలున్నాయి.

మరిన్ని వార్తలు